శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారు వటపత్ర సాయి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.
చంద్రుడు శివునికి శిరోభూషణంయితే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామి వారిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల మనసు ఆనందంతో నిండిపోతుంది.