పలాస రూరల్: భారత సాయుధ దళం నిర్వహించిన బ్లాక్ క్యాట్ ర్యాలీకి లక్ష్మీపురం టోల్గేటు వద్ద కిష్టుపురం యువత ఘన స్వాగతం పలికారు.
యువత జాతీయ జెండాలు పట్టుకొని భారత మాతాకు జై.. అంటూ వారిని ఆహ్వానించారు. జవాన్లకు తాగునీరు, శీతల పానీయాలు, బిస్కెట్లు అందజేసి, దేశభక్తిని చాటారు. కల్నల్ ఓమేస్ సింగ్ రథో, అసిస్టెంట్ సిఎండిటి భాస్కరరావు, బ్లాక్ క్యాట్ ర్యాలీ పర్యవేక్షకుడు సుదర్శన్ భరత్ పరక్రమ, జవాన్లతో కూడిన బృందం దేశంలో 7500 కిలోమీటర్లు బ్లాక్ క్యాట్ ర్యాలీ చేస్తోంది. ఒమేస్ సింగ్ రథో మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ఉత్సాహంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఉపాది పొంది, ఇక్కడే నివాసం ఉండాలని కోరారు. తమకు యువత స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సాయికిరణ్ , దీలిప్, పవన్, ప్రసాద్, ఎంపిటిసి మోహన్, తులసీరావు, భాను శంకర్, తదితరులు పాల్గొన్నారు.