ముంచుకొస్తున్న జవాద్ తుఫాన్ ముప్పు, తెలంగాణలో వేగంగా వెనుదిరిగిన నైరుతి రుతుపవనాలు, ఈసారి ఒరిస్సా - ఆంధ్రప్రదేశ్ పై విరుచుకుపడనున్న సైక్లోన్ జావద్

S7 News
0
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతం, దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ వారం జవాద్ తుఫాను (Cyclone Jawad) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన వాతావరణ బులెటిన్‌లో తెలిపింది.

IMD సూచన ప్రకారం, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఒక తుఫాను ప్రసరణ ఉంది, దీని కారణంగా రాబోయే 24 గంటల్లో తూర్పు-మధ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది. తదుపరి 24 గంటల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Cyclone Jawad Brews in Bay of Bengal) తుఫాను జవాద్ గా అక్టోబర్ 13 నాటికి బలపడి ఒడిశా-ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటే అవకాశం (Odisha-Andhra Pradesh Coasts) ఉందని తెలిపింది. చాలా చోట్ల గంటకు 40-50 కి.మీ వేగంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడొచ్చన్నారు.

అంతేకాకుండా, రాబోయే ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులపై ఉపరితల ఆవర్తనం ఉందని దీనివల్ల అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్ 15 నుండి తూర్పు భారతదేశం, దానికి ఆనుకుని ఉన్న మధ్య భారతదేశంలో వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందని IMD తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు సంబంధించిన వివరాలను ఇస్తూ, కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడు, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగాబాద్, సిల్వాసా మీదుగా రుతుపవనాల లైన్ కొనసాగుతోందని IMD తెలిపింది.

రానున్న 24 గంటల్లో మహారాష్ట్ర, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింత వెనుదిరిగే పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ సారి నిర్దేశిత సమయం కంటే ముందే తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. రాష్ట్రం నుంచి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

నిన్న మహారాష్ట్ర సరిహద్దు నుంచి హనుమకొండ వరకు వెనక్కి మళ్లినట్టు ఆ శాఖ డైరెక్టరర్ నాగరత్న తెలిపారు. ఇక నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు ఉత్తరప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉందని, దీని ప్రభావంతో రేపు అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందన్నారు. ఆ తర్వాత అది బలపడి శుక్రవారం ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, ఈసారి జూన్ 5నే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.

కాగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నెల 6 నుంచి నైరుతి నిష్క్రమణ మొదలైంది. అవి రాష్ట్రానికి వచ్చేసరికి వారం నుంచి 10 రోజుల మధ్య సమయం పడుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం గత నెలాఖరులో ప్రకటించింది. అయితే నైరుతి విరమణ వేగంగా జరుగుతుండటంతో ఆరు రోజుల వ్యవధిలోనే తెలంగాణ నుంచి నిష్క్రమణ ప్రారంభమైంది.

రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నైరుతి విరమణ పూర్తయితే... ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. గత ఏడాది అక్టోబరు 28న రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఈ ఏడాది రెండో వారంలోనే విరమిస్తున్నాయి.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top