సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూత

S7 News
0

హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రఖ్యాత కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ కన్నుమూసిన ఉదంతాన్ని విస్మరించకముందే పెను విషాదం మిగిలింది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. న్యుమోనియాతో బాధపడుతోన్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు.


న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కుటుంబ సభ్యులు ఈ నెల 24వ తేదీన ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోనే ఉంటున్నారు.


రోజురోజుకూ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. కిమ్స్ డాక్టర్లు అత్యాధునికమైన వైద్య చికిత్సను అందించినప్పటికీ.. ప్రాణాలను నిలపలేకపోయారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము అధికంగా చేరినట్లు తెలుస్తోంది. ఊపిరి పీల్చుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని సమాచారం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top