హెలికాఫ్ట‌ర్ ప్రమాద ఘటనపై రేపు పార్లమెంట్ లో ప్రకటన

S7 News
0

త‌మిళ‌నాడులోని కూనూర్ వ‌ద్ద ఆర్మీ హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 11కి పెరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా ఆయన భార్య మధులిక, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్ధర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గురుసేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేంద్ర కుమార్‌, లాన్స్‌నాయక్‌ వివేక్‌ కుమార్‌, లాన్స్‌నాయక్‌ బి. సాయితేజ, హవల్దార్‌ సత్పాల్ ఉన్నారు. మొత్తం 14 మంది ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై రేపు పార్లమెంట్ లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఢిల్లీలోని సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇంటికి వెళ్లారు. ఆయన వెంట పలువురు రక్షణశాఖ, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదం గురించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. తమిళనాడులోని ఘటనాస్థలికి రాజ్‌నాథ్‌ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రమాదంపై రాజ్‌నాథ్ సింగ్‌ తో ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే భేటీ అయ్యారు. ప్రమాదం గురించిన పూర్తి సమాచారాన్ని కేంద్రమంత్రికి ఆర్మీ చీఫ్‌ వివరిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top