భారతదేశం భయపడిందే జరిగింది. డెడ్లీ వేరియంట్ అని చెప్పుకుంటున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది . డెల్టా వేరియంట్ కంటే బాగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ఇండియాను వణికిస్తుంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో భారత్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికి భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కర్ణాటకలో బయటపడ్డ ఒమిక్రాన్ కేసులు .. వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్
డిసెంబర్ 2వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన సమావేశంలో దేశంలో ఇప్పటివరకు 2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్టు వెల్లడించారు. కర్ణాటకలో కొత్త ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్ యొక్క రెండు కేసులను భారతదేశం గుర్తించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి గురువారం తెలిపారు. దీంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. రెండు కేసుల యొక్క అన్ని ప్రాధమిక పరిచయాలు మరియు ద్వితీయ పరిచయాలు గుర్తించబడ్డాయని, అవి క్షుణ్ణంగా పరీక్షించబడుతున్నాయి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఒక వార్తా సమావేశంలో చెప్పారు. కర్ణాటకలో విదేశాల నుండి తిరిగి వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఓమిక్రాన్ వేరియంట్ కనుగొనబడిందని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటిసారిగా గుర్తించబడ్డ కేసులు ఇవేనని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19 pic.twitter.com/NlJOwcqGDf
— ANI (@ANI) December 2, 2021
కర్ణాటక రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు
ఒమిక్రాన్ గుర్తింపు గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ అవగాహన ఖచ్చితంగా అవసరం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా నియమ నిబంధనలు పాటించాలని, కరోనా కట్టడికితగిన ప్రవర్తనను అనుసరించాలని, సమూహాలుగా తిరగడానికి, సమావేశాలకు దూరంగా ఉండాలని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్థాపించిన 37 ల్యాబొరేటరీల యొక్క INSACOG కన్సార్టియం యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయత్నం ద్వారా ఇప్పటివరకు కర్ణాటకలో ఒమిక్రాన్ యొక్క రెండు కేసులు కనుగొనబడ్డాయని వెల్లడించిన ఆయన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అవగాహన ఖచ్చితంగా అవసరం అని పేర్కొన్నారు.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19 pic.twitter.com/NlJOwcqGDf
— ANI (@ANI) December 2, 2021
నిర్ధారించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ
భారతదేశంలోనే మొట్టమొదటి ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి రెండు కేసులు కర్ణాటక రాష్ట్రంలో నమోదయ్యాయని పేర్కొన్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కాకుంటే అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని బలరాం భార్గవ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణకు కావలసిన రక్షణ చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారత్ దేశంలో ఒమిక్రాన్ భయం
ఇప్పటికే భారత్ దేశంలో ఒమిక్రాన్ భయం మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఒమిక్రాన్ ఆందోళనల మధ్య కరోనా మహమ్మారి నియంత్రించడం కోసం అమలులో ఉన్న ఆంక్షలను డిసెంబర్ 31 వరకు కొనసాగించాలని హోం సెక్రటరీ ఆదేశించారు. కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా కూడా రాష్ట్రాలు మరియు యుటిలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నవంబర్ 25 సలహాను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వచ్చే వారందరినీ కఠినమైన స్క్రీనింగ్ చెయ్యాలని, ఆర్టిపిసిఆర్ పరీక్షలను నిర్వహించాలని సిఫార్సు చేశారు. నిర్లక్ష్యం తగదని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.