Janaki Kalaganaledu December 1st: జ్ఞానాంబను అరెస్ట్ చేయాల్సిందే.. మల్లిక చేసిన కుట్రకు షాక్ లో రామచంద్ర!

S7 News
0

జానకి కలగనలేదు సీరియల్ రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి కలలు కలగానే మిగిలిపోతున్న తరుణంలో ఆమెకు భర్త నుంచి కూడా సహాయం అందుతుంది. అత్త పెట్టిన కట్టుబాట్ల మధ్యలో ఇబ్బందులను దాటి తన కలను నెరవేర్చుకోవాలని అనుకున్న జానకి కొంత సందిగ్ధంలో పడుతుంది. ఇక రేటింగ్స్ అందుకోవడంలో జానకి కలగనలేదు మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 44వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 43వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 44వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 183వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..విషంతో మల్లిక కుట్ర

జానకిని ప్రతి విషయంలో మెచ్చుకోవడం మల్లికకు ఏ మాత్రం నచ్చదు. ఎలాగైనా ఆమె చదువు విషయాన్ని బయట పెట్టి జానకిని ఇంట్లో నుంచి పంపించాలి అని అనుకున్న మల్లిక ప్లాన్స్ రివర్స్ అవుతాయి. జ్ఞానాంబ అత్తగారు మైరావతి జానకిని ఇంట్లో నుంచి ఒకంపించాలని ఆదేశాలు చేసినప్పటికీ కూడా జానకి ఎప్పటిలానే తప్పించుకుంటుంది. ఇక మరింత ఆగ్రహానికి లోనైన మల్లిక జానకి పై నిందలు మోపేందుకు ఆర్డర్ ఇచ్చిన పూతరేకులలో ఒక మందును కూడా కలుపుతుంది. అందరికీ ఫుడ్ పాయిజన్ అయ్యే విధంగా చేస్తుంది. తప్పకుండా ఆ విషయంలో జ్ఞానాంబకు చెడ్డ పేరు వస్తుంది. ఆ తర్వాత ఆ ప్రభావం జానకి తెచ్చిన నెయ్యి పై కూడా పడుతుంది అని మల్లిక కుట్ర పన్నుతుంది.

చదువు విషయం మర్చిపోవాల్సిందే..

ఇక మరోవైపు రామచంద్రం జానకి చదువు విషయంలో ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకి తన కుటుంబం కోసం తన కన్న కలలను త్యాగం చేస్తూ ఉండటం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతాడు. మా అమ్మ మాటను గౌరవించే తన చదువును వదిలేసుకుందని మళ్ళీ ఆమెను చదివించాలని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం మళ్ళీ ఇంట్లో గొడవలు రావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అందుకే తన చదువును కూడా ఇంతటితో మర్చిపోవాలని అనుకుంటున్నట్లు చాలా వివరంగా చెబుతుంది. అంతేకాకుండా మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో నేను మాట వింటాను. ఈ ఒక్కసారి మాత్రం నా మాట వినండి అంటూ మమ్మల్ని బ్రతిమాలి అనుకుంటున్నాను అని అడుగుతుంది. మరొకసారి మన మధ్యలో చదువు విషయం రాకూడదు అని కూడా చెబుతుంది.


తండ్రి స్థానంలో..

జానకి ఎంత చెప్పినప్పటికీ కూడా రామచంద్ర మాత్రం ఆమె చదువు విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఇక బాధపడుతూ తల్లి గదిలోకి వెళ్లి ఆమె కాళ్ళు కూడా పడతాడు. అయితే ఎందుకు బాధ పడుతున్నావు అంటూ తల్లి అడిగినప్పటికీ కూడా రామచంద్ర అసలు నిజాన్ని చెప్పడు. ఇక ఆ తర్వాత బయటకు వచ్చి జానకి విషయంలో నిజంగా తప్పు జరుగుతుంది అని ఆమె నా కుటుంబం కోసం తన చదువును త్యాగం చేస్తోందని అనుకుంటాడు. ఒకవేళ తన తండ్రి ఈ పాటికి ఉంటే తప్పకుండా ఐపీఎస్ చదివించేవారు అని, ఇప్పుడు ఆ బాధ్యతను నేను తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని రామచంద్ర తన మనసులో తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.

ఎలక్షన్ కోసమే..

ఇక మరోవైపు జానకి కూడా భర్త గురించి ఎంతగానో ఆలోచిస్తుంది. ఎలా చెబితే రామచంద్రకు అర్థమవుతుందని బాధపడుతూ ఉంటుంది. ఇక ఉదయమే జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరూ కలిసి సునంద దేవి ఇంట్లో పుట్టినరోజు వేడుకకు వెళ్తారు. సునంద దేవి కొడుకు జ్ఞానాంబను ఎందుకు పిలిచావు అని ప్రశ్నించినప్పటికీ ఆమె ఎలక్షన్ కోసం పిలువక తప్ప లేదు అని చెబుతోంది. జ్ఞానాంబ మాట మీద చాలా ఓట్లు ఆధారపడి ఉన్నాయి అందుకే మన కార్పొరేటర్ గా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అంటే జ్ఞానాంబను కాక పట్టాల్సిన అవసరం ఉంది అని కొడుకుతో సునంద దేవి వివరణ ఇస్తుంది.

పోలీసుల ఎంట్రీ..

ఇక జ్ఞానాంబ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఒక్కసారిగా పార్టీలోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. జ్ఞానాంబ అరెస్టు చేయబోతున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నా భార్య ను అరెస్టు చేయడం ఏమిటని ఆమె చీమకు కూడా హాని చేయదు అని గోవిందరాజులు పోలీసులను ప్రశ్నిస్తాడు.


అరెస్ట్ చేయాల్సిందే..

అయితే వెంటనే మరొక వ్యక్తిని పిలిచిన పోలీసు అధికారి ఇటీవల మీరు ఈ వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ కు పూతరేకులు ఆర్డర్ చేశారు కదా అని రామచంద్రని అడుగుతారు. అవును అంటూ అతను సమాధానం చెప్పడంతో ఆ వేడుకలో పూతరేకులు తిని చాలా మంది కి ఫుడ్ పాయిజన్ అయింది అని ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నారు అని ఫుడ్ సెక్యూరిటీ అధికారి కూడా చెబుతాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. స్వీట్ షాప్ ఓనర్ అయినటువంటి జ్ఞానాంబను అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పడంతో రామచంద్ర సునందా దేవిని బ్రతిమలుతాడు. మీకు ఎంతో రాజకీయ పలుకుబడి ఉంది కదా మా అమ్మ ను అరెస్టు చేయకుండా పోలీసులను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అభ్యర్థిస్తాడు. కానీ సునంద మాత్రం ఇది నా చేతుల్లో లేని పని అంటూ సమాధానం ఇస్తుంది. ఇక మరోవైపు మల్లిక కూడా ఆందోళన చెందుతుంది. మరి ఈ పరిణామాలతో జానకి జీవితం ఎలా మారుతుందో చూడాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top