అర్బన్ నక్సల్స్ కారణంగా 40-50 ఏళ్ల సమయం వృథా అయ్యింది: ప్రధాని మోదీ

S7 News
0

 


PM Modi: గుజరాత్‌లోని భరూచ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. భరూచ్‌లో రూ. 8 వేల కోట్లతో వివిధ పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్స్ కారణంగా 40-50 ఏళ్ల సమయం వృథా అయ్యిందని వ్యాఖ్యానించారు. నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి ప్రస్తావించి.. మోదీ ఈ కామెంట్స్ చేశారు.


ప్రధానాంశాలు:

  • గుజరాత్‌లోని భరూచ్‌లో ప్రధాని మోదీ పర్యటన
  • రూ. 8 వేల కోట్లతో వివిధ పథకాలు ప్రారంభం
  • అర్బన్ నక్సల్స్ కారణంగా టైం వృథా అయ్యిందని వ్యాఖ్య
PM Modi: అర్బన్ నక్సల్స్ కారణంగా.. నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం 40-50 సంవత్సరాలు ఆలస్యం అయ్యిందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అన్నేళ్ల సమయంలో.. దేశం ఇంకా ఎంతో అభివృద్ధి చెందేదని వివరించారు. అనేక ప్రయత్నాల తర్వాత సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం (Sardar Sarovar Dam) పూర్తయిందని మోదీ వివరించారు. గుజరాత్‌లోని భరూచ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. రూ. 8000 కోట్ల విలువైన వివిధ పథకాలను ప్రధాని ప్రారంభించారు.
భరూచ్ అభివృద్ధిని ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధితో పాటు, భరూచ్‌ (Bharuch)లో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండబోతోందని ప్రకటించారు. అందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. గుజరాత్ నుంచి ఎగుమతులను పెంచడంలో.. ఈ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తనకు పరిపాలనలో పెద్దగా అనుభవం లేదని.. కానీ భూపేంద్ర పటేల్‌కు పంచాయితీ నుంచి అసెంబ్లీ వరకు దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. అందుకే గుజరాత్ (Gujarat) అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారు.


ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) మరణం దేశానికి తీరని లోటు అని.. ప్రధాని మోదీ అన్నారు. ములాయంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. 2014లో బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు.. ప్రతిపక్ష నేతలందరితో మాట్లాడానని.. ములాయం తనకు సలహాలు, ఆశీస్సులు అందించారని చెప్పారు. 2019 పార్లమెంట్‌లో ములాయం సింగ్ యాదవ్ తన ప్రసంగంలో.. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత తనను తిరిగి ప్రధానిగా చూడాలని కోరుకున్న విషయాన్ని మోదీ (PM Modi) గుర్తు చేసుకున్నారు. ఆయన అనుభవం ఎందరికో మేలు చేసిందని వివరించారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top