న్యూఢిల్లీ: ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని ఉంటుంది.. ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవు అంటూ కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ (Nityananda rai) కీలక వ్యాఖ్యలు చేశారు.గురువారం కేంద్రమంత్రితో టీడీపీ ఎంపీలు (TDP MPs) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని (AP Capital issue) అంశంపై నిత్యానందరాయ్ స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో రెండు రాజధానులు ఉన్నాయి కానీ అవి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. రైతుల పాదయాత్రకు ఆటంకాలు కలిగించడం సరికాదన్నారు. డీజీపీతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలిస్తామని టీడీపీ ఎంపీలతో నిత్యానందరాయ్ (Union minister) పేర్కొన్నారు.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.