APSRTC: రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.. రోడ్ల దుస్థితిపై నాదెండ్ల మనోహర్ సైటర్లు
AP Roads: ఏపీలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వైసీపీ ప్రభుత్వంపై (YSRCP) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో (West Godawari) ఆర్టీసీ బస్సు (APSRTC Bus) వెనక చక్రాలు రన్నింగ్‌లోని ఉండగానే ఊడిపోయాయని ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో రహదారులు నరక కూపాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. #GoodMorningCMSir హ్యాష్ టాగ్‌తో సీఎం జగన్‌పై సెటైర్లు పేల్చారు.
ప్రధానాంశాలు:
- రన్నింగ్‌లో ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు
- తప్పిన పెను ప్రమాదం
- ఘటనపై నాదెండ్ల మనోహర్ సెటైరికల్ ట్వీట్
APSRTC Bus Wheels: ఏపీలో రోడ్ల (AP Roads) దుస్థితి అధ్వాన్నంగా తయారైందని జనసేన (Janasena) నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వైసీపీ ప్రభుత్వంపై (YSRCP) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రహదారులు నరక కూపాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో (West Godawari) ఆర్టీసీ బస్సు (APSRTC Bus) వెనుక చక్రాలు రన్నింగ్‌లోని ఉండగానే ఊడిపోయాయని అందుకు సంబంధించిన వార్తలను ఆయన ట్వీట్ చేశారు.నరసాపురం డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏలూరు (Eluru) వెళ్తుండగా ఈ ఘటన జరిగిందన చెప్పారు. ఈ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని అన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. బస్సును ఆపిన వెంటనే వారంతా బతుకు జీవుడా అనుకుంటూ కిందకు దిగారన్నారు.ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మనోహర్.. (Nadendla Manohar Tweet) సీఎం జగన్‌పై (YS Jaganmohan Reddy) సెటైర్లు పేల్చారు. "గుడ్ మార్నింగ్ సీఎం సార్.. రోడ్డు... ఏ గుంతలోపడతారో తెలియదు !, బస్సు... ఏ చక్రం ఎప్పుడు ఊడుతుందో తెలియదు ! పరిపాలన…అంటే తెలియదు !, రాష్ట్రంలో రోడ్లు ఉంటాయనీ, బస్సులు, బైకులు, కార్లు లాంటి వాహనాలు తిరుగుతాయని తెలియదు." అని నాదెండ్ల ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిపై జనసేన గతకొంత కాలంగా వివిధ రూపాల్లో పోరాటం చేస్తోంది. అనేక నిరసన కార్యక్రమాలు, ఆందోళనకు జనసేన పార్టీ పిలుపునిచ్చింది. సోషల్ మీడియా (Social Media) ప్రచారం ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని మారమూల గ్రామాలు, మండలాలత పాట ప్రధాన పట్టణాల రోడ్ల పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్ తో గతంలో డిజిటల్ క్యాంపెయిన్ (Janasena Digital campaign) చేపట్టారు. రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు చేయలేదని, గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపేందుకే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ (Pawan kalyan) స్వయంగా పాల్గొన్నారు. రోడ్ల మరమ్మత్తుల కోసం ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు పక్కదారి పట్టిస్తూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. రోడ్ సెస్ వసూలు చేస్తున్నా వాటిని రోడ్ల కోసం వినియోగించడం లేదని అన్నారు.