Bharat Jodo Yatra: తగ్గేదే లేదంటున్న రాహుల్ గాంధీ... నడి రోడ్డుపై బాలుడితో పోటీ

S7 News
0

భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఉత్సాహంగా సాగుతుంది. ఒక పక్క ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరితో కలగలసి పోతున్నారు. దీనికి చిహ్నం ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో రాహుల్ గాంధీ ఓ పిల్లవాడితో పోటీ పడ్డారు. అందుకోసం నడిరోడ్డుపైనే బాలుడితో కలసి ఫుష్ అప్‌లు తీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆ పార్టీ నాయకులు షేర్ చేశారు.

 
Push Up Challenge

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో సాగుతున్న కాంగ్రెస్ యాత్ర
  • ఉత్సాహంగా ముందుకు సాగుతున్న రాహుల్
  • వైరల్ అవుతున్న రాహుల్ వీడియోలు
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (52) ఎంతో ఉత్సాహంగా యాత్రలో ముందుకు కదులుతున్నారు. ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ముసలివాళ్ల నుంచి పిల్లల వరకూ అందరితో చనువుగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

అందుకే ఈ యాత్ర మొదలైన దగ్గర నుంచి రాహుల్ గాంధీకి సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రోడ్డుపై రాహుల్ గాంధీ చేసిన మరో పని అందరిని ఆకట్టుకుంటుంది. రాహుల్ గాంధీ, ఓ బాలుడితో కలసి పోటాపోటీగా రోడ్డుపైనే పుష్ అప్‌లు తీశారు. దీనికి సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాల ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా సమన్వయకర్త నితిన్ అగర్వాల్ రాహుల్ పుష్ అప్ ఛాలెంజ్ అని క్యాప్షన్ పెట్టి సంబంధిత వీడియోను పోస్ట్ చేశారు.


ఆ వీడియోలో రాహుల్ గాంధీ, ఆ బాలుడితో పోటీ పడినట్టు తెలుస్తుంది. పోటీ అనంతరం రాహుల్ గాంధీ, ఆ బాలుడికి కరచాలనం చేశారు. రాహుల్ అలా పుష్‌ అప్‌లు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇదేకాదు రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక వీడియో, ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.


మొదట తమిళనాడులో ఆయన మహిళలతో మాట్లాడడం.. వాళ్లు పెళ్లి చేసుకుంటే తమిళనాడు అమ్మాయిని చూస్తామని చెప్పడంతో.. రాహుల్ గాంధీ ముసి ముసిగా నవ్వారు.. సంబంధిత ఫోటో అప్పట్లో వైరల్ అయింది. అలాగేకర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధ రామయ్య చేయి పట్టుకుని రాహుల్ గాంధీ పరుగు పెట్టించడం, పార్టీ జెండా పట్టుకుని.. డీకే శివకుమార్‌తో రన్‌లో పాల్గొనడం, ఇటీవల బోరున కురుస్తోన్న వర్షాన్ని లెక్క చేయకుండా రాహుల్ గాంధీ ప్రసంగించడం.. వైరల్ అయ్యాయి. ఇవే కాదు యాత్రలో తన తల్లి సోనియా గాంధీ షూ లేసును కడుతూ రాహుల్ గాంధీ చాలామంది మనస్సులను గెలుచుకున్నారు. కాగా ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో రాహుల్ గాంధీ ఈ యాత్ర బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని నడిపిస్తున్నారు. ఆయనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో ఆయన కలిసే తీరులో పరిణతి అందరిని ఆకర్షిస్తుంది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top