ఏపీలో రోడ్లు బావున్నాయి.. ఆ రోడ్లని గుంతలు తవ్వి టీడీపీ తప్పుడు ప్రచారం: మంత్రి దాడిశెట్టి రాజా

S7 News
0

Dadisetti Raja ఏపీలో రోడ్ల పరిస్థితిపై స్పందించారు. రోడ్లను బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటికే రోడ్ల మరమ్మతుల కోసం రూ.1500 కోట్లు కేటాయించారన్నారు. 2023కి రాష్ట్రంలో రోడ్లు పూర్తి చేస్తామన్నారు. బావున్న రోడ్లను తవ్వి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే ప్రజల్ని డైవర్ట్ చేయడానికే జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉత్తరాంధ్ర యాత్రకు వెళుతున్నారని విమర్శించారు. వికేంద్రీకరణ అంశంపై టీడీపీకి సవాల్ విసిరారు.

 

ప్రధానాంశాలు:

  • రాష్ట్రంలో రోడ్లపై మంత్రి దాడిశెట్టి కామెంట్స్
  • రోడ్లను తవ్వి తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • పవన్ కళ్యాణ్‌వి డైవర్షన్ రాజకీయాలంటూ
రాష్ట్రంలో రోడ్లపై టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా (Dadisetti Raja). బాగున్న రోడ్లకు గుంతలు పెట్టి డ్రామా చేస్తున్నారని.. రాష్ట్రంలో రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రోడ్లు వేయడం అనేది నిరంతర ప్రక్రియ అని.. వర్షాకాలం తగ్గిన వెంటనే రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారన్నారు. అలాగే రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1500 కోట్లు కేటాయించారని.. 2023 కల్లా రాష్ట్రంలో రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వీడియోను టీడీపీ కూడా ట్వీట్ చేసింది.
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)పైనా మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. విశాకలో ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన అన్నారు. పవన్‌ డైవర్షన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వని చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్‌కు ఇచ్చారని.. అయినా సిగ్గులేకుండా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు చెప్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ తీసుకుని ఆయన మాత్రమే బాగుంటే సరిపోతుందా.. ఐదు కోట్ల మందికి వారి భావనను తెలియపరచుకునే హక్కు లేదా అన్నారు.

  • అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని సవాల్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని.. ఇప్పుడు ప్రణాళికలో భాగంగానే రథయాత్రలు, పాదయాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మరోవైపు ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌లు జేఏసీ సభ్యులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర ప్రాంత ఉనికి చాటేల గర్జన ఉంటుందని.. జేఏసీ నేతలు అన్ని పార్టీలకు ఆహ్వనం పంపుతారన్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు తమ వైఖరి తెలియజేసాయని.. వారు మద్దతు ఇస్తారని తాను భావించడం లేదన్నారు. ఉత్తరాంధ్ర రైతులు సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు.

రాజధాని అంటే అమరావతి ఒక్కటేనా.. రాష్ట్రమంటే అమరావతి 29 గ్రామాలేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ గర్జన అంటే పవన్ కళ్యాణ్ నిద్ర లేచారని.. విశాఖ గర్జన జరిగిన రోజే పవన్ కళ్యాణ్ విశాఖలో మీటింగ్ అవసరమా అన్నారు. ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికే పవన్ విశాఖ పర్యటన.. ఆయన పర్యటన వాయిదా వేసుకోవాలన్నారు. విశాఖలో భూములు ఎవరు దోచుకున్నారో జనానికి తెలుసని.. ప్రజలంతా విశాఖ వాణి వినిపించేలా గర్జించాలన్నారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top