'మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌'.. ఆ నలుగురే టార్గెట్, ఆసక్తికర ఫోటో ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్

S7 News
0

 


Pawan Kalyan మరోసారి జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. విశాఖ పర్యటనకు ముందు ఆసక్తికర ట్వీట్ చేశారు. మౌంట్ దిల్ మాంగే మోర్ అంటూ నలుగురిపై విరుచుకుపడ్డారు.


ప్రధానాంశాలు:

  • విశాఖ రుషికొండను ప్రస్తావించిన పవన్
  • మౌంట్ దిల్ మాంగే మోర్ అంటూ ఎద్దేవా
  • మూడు రోజులుగా జనసేనాని వరుస ట్వీట్లు
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జగన్ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా మరోసారి టార్గెట్ చేశారు.. రెండు రోజుల నుంచి దేనికి గర్జనలు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేనాని తాజాగా విశాఖలో పరిణామాలపై స్పందించారు. ఉత్తరాంధ్ర పర్యటనకు ముందు.. విశాఖను అమెరికాలోని మౌంట్ రష్‌మోర్‌తో పోలుస్తూ ఆసక్తికర ట్వీట్‌లు చేశారు.
పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో.. ‘United States of America లోని South Dakota లో ఉన్న 'మౌంట్‌ రష్‌మోర్'.. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకి చిహ్నం’అన్నారు. ఈ పర్వతంతో విశాఖలోని రుషికొండను పోలుస్తూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో ‘'United States of Andhra'.. విశాఖ జిల్లా లోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న.. ఈ 'మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌'.. 'ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం'.. P.S (బూతులకి కూడా…) అంటూ ట్వీట్ చేశారు. నలుగురి ఫోటోలను కార్టూన్‌ రూపంలో ప్రస్తావించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల15 నుంచి జనసేనాని విశాఖలో పర్యటిస్తారు. 16న ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులతో, పార్టీ వాలంటీర్లతో సమావేశం అవుతారు. అంతేకాదు ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమీక్షలు చేస్తారు. పార్టీ కేడర్‌కు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. విశాఖ పర్యటనకు ముందు పవన్ చేసిన ఈ ట్వీట్‌లు ఆసక్తికరంగా మారాయి.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top