కార్ డోర్ చూసుకోకుండా తెరిస్తే.. ఎంత ఘోరం జరిగిందో చూడండి!

S7 News
0

 


Car Door Open: రోడ్డుపై ఆపిన కార్ డోర్.. ముందూ వెనుకా చూసుకోకుండా ఒక్కసారిగా తెరిస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చూశారా.. కర్ణాటక స్టేట్ రోడ్ సేఫ్టీ అథారిటీ ఈ వీడియోను షేర్ చేసింది. పబ్లిక్ రోడ్లపై కార్ డోరు తీసే ముందు అద్దంలో వాహనాల రాకపోకలను గమనించుకోండి. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ సందేశం ఇచ్చింది. ఇంతకీ ఈ ప్రమాదంలో స్కూటీపై మహిళకు ఏం జరిగిందో మరి!


కొంత మంది రోడ్డు మీద ఆపిన కార్ డోర్లను చూసుకోకుండా అకస్మాత్తుగా తెరుస్తారు. దీని వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలుసా..? ఎదుటివారి ప్రాణాలు పోయే ముప్పు ఉంది. కర్ణాటక స్టేట్ రోడ్డు సేఫ్టీ అథారిటీ షేర్ చేసిన ఇలాంటిదే ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ ప్రమాదంలో స్కూటీ మీద వెళ్తున్న మహిళకు ఏం జరిగిందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ ఎస్‌యూవీ వాహనం రోడ్డు పక్కన ఆపి ఉంది. దాని కుడివైపున డోర్‌ను ఒక్కసారిగా తెరిచారు. అటుగా వస్తున్న స్కూటీ ఆ డోర్‌ను గుద్దుకోవడంతో.. దానిపై ఉన్న మహిళ రోడ్డుపై పడిపోవడం, వెనకాలే వస్తున్న కారు ఆమెను తొక్కుకుంటూ వెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. కార్ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. అక్కడున్న వారంతా మహిళ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

  • సెప్టెంబర్ 24న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కర్ణాటక స్టేట్ రోడ్ సేఫ్టీ అథారిటీ ట్వీట్ చేసింది. ‘పబ్లిక్ రోడ్లపై కారు డోరు తీసే ముందు అద్దంలో ముందుగా వాహనాల రాకపోకలను గమనించుకోండి. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. బుద్ధితో వ్యవహరించండి. కాస్త జాగ్రత్తగా ఉండండి’ అని రాసుకొచ్చింది.

ప్రమాదంలో గాయపడిన మహిళ పరిస్థితి ఏమైంది? ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్య తీసుకున్నారా? తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆ మహిళకు ఏం జరిగిందోనని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై కారు డోరు తీసే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు ఎంతటి ఘోర ప్రమాదానికి దారితీసిందో చూశారుగా.. జర భద్రం!
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top