తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చిత్రపటం బహుకరించి మర్యాదపూర్వకం గా కలిసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ
సత్య సాయి జిల్లా పుట్టపర్తి:-
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి వర్యులు,భవిష్యత్ తరాల పసుపు సైనికుల మార్గనిర్దేశకుడు,యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారిని ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసం లో కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చిత్రపటం బహుకరించి,శాలువాతో సత్కరించి,మర్యాదపూర్వకం గా కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకు రావడానికి మా శాయ శక్తులా కృషి చేస్తామని అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మేము అహర్నిశలు కృషి చేస్తామని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం తరుపున నారా లోకేష్ బాబు గారికి తెలియజేసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో బేకరీ నాయుడు,శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి ప్రసాద్,బిసి నాయకుడు సుధాకర్ పాల్గొన్నారు.