●మంత్రి ఉషశ్రీ చరణ్
●గత ప్రభుత్వాల పాపమే ఈ దుస్ధితి
●పట్టాలివ్వకపోవడంతో పేదలు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు..!
●రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
●ప్రతి ఒక్కరికీ జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించి ఇస్తాం..!
●అనంతపురం రూరల్ మండలం సుందరయ్యకాలనీ, జాకీర్ కొట్టాలు, దండోరాకాలనీ, ఆదర్శనగర్ కాలనీల్లో పర్యటించిన మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఆహుడా చైర్మన్
పరదలతో ముంపులకు గురైన ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు ఉషశ్రీచరణ్.తెలిపారు. వరద ముంపునకు గురైన అనంతపురం రూరల్ మండలం సుందరయ్య కాలనీ, జాకీర్ కొట్టాలు, దండోరాకాలనీ, ఆదర్శనగర్ కాలనీల్లో మంత్రితో పాటు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , ఎంపీ గోరంట్ల మాధవ్. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి , కలెక్టర్ నాగలక్ష్మీ , ఆహుడా చైర్మన్ మహలక్ష్మీ శ్రీనివాస్ , వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి గురువారం పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాల్లోకి రావాలని మంత్రి కోరారు. మునుపెన్నడూ లేని విధంగా విపత్తు ఏర్పడిందని ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈరోజు వర్షపాతం నమోదైందన్నారు. ఊహించని విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. రెండు రోజులుగా మా కుటుంబ సభ్యులు, మా పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందిస్తున్నారు. బాధితులదరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వాల పాపమే ఈరోజు ఈ దుస్థితికి కారణం. గత ప్రభుత్వంలో పేదలకు పట్టాలివ్వకపోవడంతోనే వంక పారంబోకు స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇల్లు మంజూరు చేస్తున్నాం. అనంతపురం నగరం చుట్టూ జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరికీ జగనన్న కాలనీల్లో ఇంటిస్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామన్నారు. దీనిపై కలెక్టర్ తో కూడా చర్చించామన్నారు.
●ఒక్కొక్కరికీ రూ. 2 వేలు పంపిణీ..!
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బును మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఆహుడా చైర్మన్ చేతుల మీదుగా అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు చొప్పున అందజేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రకటించిన సొంత నిధులతో రూ. 3 వేలు, ఒక పాకెట్ బియ్యంను బాధితుల ఇళ్ల వద్దకు వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారు. మంత్రి ఉషశ్రీచరణ్ బాధిత కుటుంబాలకు ఉల్లన్ రగ్గులు పంపిణీ చేశారు. కాగా పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు.
●కాటిగానికాలవ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
అనంతపురం రూరల్ మండలం కాటిగాని కాలవ చెరువు తెగిపోతోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాప్తాడు నియోజవకర్గ వైసిపి నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి.వెళ్లి పరిశీలించారు. చెరువులోకి వరద నీరు ఎక్కువ చేరడంతో గట్టు తవ్వి చెరువులోని నీరు దిగువ ప్రాంతాలకు వదిలారని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు...
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు..