నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే ద్విచక్ర వాహనదారులకు మంగళగిరి పట్టణ సీఐ అంకమ్మరావు కౌన్సిలింగ్
20 ద్విచక్ర వాహనాలు సీజ్
మంగళగిరి పట్టణంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు సీఐ బి అంకమ్మరావు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి కౌన్సిలింగ్ నిర్వహించారు. 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పోలీసులు వాహనదారులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా అంకమ్మరావు మాట్లాడుతూ,టిఆర్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సదరు వాహనం పోయినా కనుగొనడం కష్టమని తెలిపారు. సక్రమంగా లేని (irregular) నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకొని తిరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ నేపథ్యంలో నెంబర్ ప్లేట్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు భవిష్యత్తులో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ నారాయణ సిబ్బంది పాల్గొన్నారు.