రవాణా విభాగంలో వేడుకగా ఆయుధ పూజ

S7 News
0
టీటీడీ రవాణా విభాగం లో శుక్రవారం ఆయుధపూజ వేడుకగా నిర్వహించారు . ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి , జేఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , సివిఎస్వో  శ్రీ నరసింహ కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . ముందుగా ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవో కు ఆ విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు . అనంతరం వీరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయుధ పూజలో పాల్గొన్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం జిఎం శ్రీ శేషారెడ్డి ఈవో , జేఈవో లు ,సివిఎస్వో ను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్బంగా ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ , వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా దీపావళి ముందు ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయుధ పూజ చేశామని ఆయన తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ ఎ ఎం ఎఫ్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న , డి ఐ శ్రీ మోహన్ తో పాటు పలువురు అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు .

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top