హెచ్‌ఓడిలకూ ఫేషియల్‌ : ఉద్యోగులపై లేట్‌ యాక్షన్‌

S7 News
0
25 నుండి ప్రయోగాత్మకంగా అమలు ఉత్తర్వులుజారీ...
అమరావతి : శాఖాధిపతులకు, వారి కార్యాలయ సిబ్బందికీ ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇవే ఉత్తర్వులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులకు, ఇతర ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని జిఓలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులలో పేర్కొన్న నిబంధనలు చర్చనీయాంశంగా మారాయి. శాఖాధిపతులు సాధారణంగా ఎక్కువగా పర్యటనల్లో ఉరటారు. వారు పర్యటనలో ఉన్న సమయంలో ముఖ గుర్తిరపు హాజరు నమోదు చేసినా, సెలవులో లేదా ఇతర శిక్షణలో ఉన్నా, ఆ విషయాలను ఆ శాఖలకు చెందిన కార్యదర్శులు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి హాజరును బట్టి ఆబ్సెంట్‌లను, సెలవులను నిర్ణయించే అధికారం కూడా వారికి అప్పచెప్పారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉన్న మిగిలిన ఉద్యోగుల హాజరు పర్యవేక్షణ బాధ్యతను కూడా ఆ శాఖలోని మధ్యస్థాయి అధికారికి అప్పగిరచారు. ఆ అధికారి ప్రత్యేకంగా ఒక లీవ్‌ రిజిస్టర్‌ను నిర్వహిస్తూ లేటుగా వచ్చే ఉద్యోగి వివరాలను అరదులో నమోదు చేస్తూ వారిపై చర్యలు తీసుకునేలా ఉత్తర్వుల్లో పొరదుపరిచారు. అవసరమై వారి సెలవుల్లో కోత పెట్టే అధికారాన్ని ఆయనకు అప్పగించారు.ఈ విధానం ఈ నెల 25వ తేది నుండి 31 వ తేది వరకు ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. నవంబర్‌ ఒకటవ తేది నుండి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ప్రతి శుక్రవారం హాజరు వివరాలను ఆయా శాఖల ఓపి అధికారులకు సాధారణ పరిపాలన శాఖకు పంపాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top