* ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో కృషి
* నిరంతరంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
* మాట తప్పడు.. మడమ తిప్పని నాయకుడు
* సీఎం జగన్మోహన్ రెడ్డి..
* 8వ రోజు గడప గడపకు మహా పాదయాత్రలో..
* తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి
* సంఘీభావం తెలిపిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీ అభివృద్ధికి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి త్రికరణ శుద్ధితో కృషి చేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నారు.. అని తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. 8వ రోజు గడప గడపకు మహా పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లు, దామినేడు, నక్కల కాలనీ, హరిజనవాడ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఎంపీపీ మోహిత్ రెడ్డి మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. భారీ జన సందోహం నడుమ గడప గడపకు మహా పాదయాత్ర కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డితో కలిసి గడప గడపకు పర్యటించారు. హరిజనవాడ వద్ద ఎంపీ గురుమూర్తి, మోహిత్ రెడ్డికి భారీ గజమాలతో ఆహ్వానం లభించింది. సీఎం జగనన్నను, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నను ఆశీర్వదించాలని ఎంపీ ప్రజలను కోరారు. అంతే కాకుండా గడప గడపన లబ్ధిదారులకు ప్రభుత్వ పథక మంజూరు పత్రాన్ని మోహిత్ రెడ్డితో కలిసి అందజేశారు. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్లలోని ప్రతి బ్లాక్ వద్దకు వెళ్లారు. ప్రజలతో మమేకమయ్యారు. ఎలా ఉన్నారు.. అక్క, అమ్మ, అవ్వ, తాత, అన్న.. అంటూ పలకరించారు. అన్ని సౌకర్యాలు అందుతున్నాయా..! అంటూ ఆరా తీశారు. ఏదేని సమస్యలు ఉన్నాయా..! అంటూ వాకబు చేశారు. ఏ పని చేస్తున్నారు..! ఎంత మంది పిల్లలు..! ఏమి చదువుతున్నారు..! అంటూ యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా ఆప్యాయంగా పలకరించారు. ఇదే తరహాలో మహిళలు కూడా మోహిత్ రెడ్డికి అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. పూల మాలలు వేస్తూ.. హారతులు పడుతూ..గుమ్మడి, కొబ్బరి కాయలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మాట తప్పడు.. మడమ తిప్పడు..
మాట తప్పడు.. మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ఇచ్చిన హామీలకంటే ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పథకాలు అమలు చేశారని వెల్లడించారు. శాశ్వత సీఎంగా జగనన్న ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజా సంక్షేమానికి నిరంతరంగా పరితపిస్తున్నారని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి ప్రకోప నేపథ్యంలో రాయల చెరువు గండి పడ్డ క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయక శ్రమించారన్నారు. సీఎం జగనన్నతో పాటు నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం..
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మహా పాదయాత్రకు సంకల్పించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, దామినేడు, నక్కల కాలనీలలో కాలువల సమస్యను ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన ఎంపీపీ వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. మెరుగ్గా పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని ప్రజలు కోరారు. స్పందించిన ఎంపీపీ పంచాయతీ అధికారులకు, సిబ్బందికి సూచించారు. పాఠశాలలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి జాప్యం ఉండరాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్రా రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ శ్రీధర్, తిరుపతి రూరల్ మండల వైస్ ఎంపీపీలు యశోద, మాధవ రెడ్డి, ఎంపీటీసీ లు నరేష్, శివకుమార్, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, మునీంద్రా, యోగానంద, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.