గో దర్శనం విశిష్టతను భక్తులకు తెలిపేలా ఏర్పాట్లు - అధికారులకు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదేశం

S7 News
0
గో దర్శనం విశిష్టతను భక్తులకు తెలిపేలా ఏర్పాట్లు 
- అధికారులకు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదేశం

అలిపిరి నుంచి నడక మార్గం , వాహనాల్లో తిరుమలకు వెళ్ళే భక్తులు సకల దేవతా స్వరూపిణి అయిన గోమాత దర్శనం చేసుకున్నాకే తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్ళేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు .
         అలిపిరి వద్ద టీటీడీ నిర్మించిన సప్త గో ప్రదక్షణ మందిరం, వేణుగోపాల స్వామి ఆలయం , శ్రీవారి పాదాల మండపం ను శుక్రవారం ఆయన పరిశీలించారు . గో దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడం శ్రేష్ఠమనే విషయం, 
గో పూజ విశిష్టతను భక్తులకు వివరించేలా తగినన్ని బోర్డులు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు . అలాగే గోప్రదక్షిణ మందిరం పరిసర ప్రాంతాలు మరింత పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు . 

      అంతకు ముందు ఈవో శ్రీ ధర్మారెడ్డి టీటీడీ గో శాలను సందర్శించారు . అక్కడ జరుగుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ , నెయ్యి తయారీ కేంద్రం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు . డిసెంబర్ కు పనులు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . అగరబత్తుల తయారీ కేంద్రం పరిశీలించారు .ఉత్పత్తి పెంచడానికి అవసరమైన యంత్రాలు , సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు .
     జెఈవో శ్రీ వీరబ్రహ్మం , గోశాల సంచాలకులు డాక్టర్ హరనాథ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు .
------------------------------------------- టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top