మంత్రి సురేష్ ను కలిసిన మార్కాపురం సబ్ కలెక్టర్
మార్కాపురంకు నూతనంగా నియమితులైన సబ్ కలెక్టర్ సెదు మాధవన్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బాధ్యతలు చేపట్టిన తరువాత యర్రగొండపాలెం లోని క్యాంప్ కార్యాలయం లో సబ్ కలెక్టర్ మంత్రిని కలిశారు.
ఈసందర్బంగా మార్కాపురం సబ్ డివిజన్ లోని పలు సమస్యలపై చర్చించారు. జిల్లాల పునర్విభజన సమయంలో ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వటం జరిగిందని, సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ప్రజాప్రతినిధులుగా మేముచేసిన సిఫారసుతో ప్రభుత్వం తక్షణమే నియామకం చేపట్టినట్టు మంత్రి వివరించారు.
పశ్చిమ ప్రకాశం అభివృద్ధి లో అంకితభావంతో పనిచేయాలని అందుకు మా వంతు సహకారం తప్పక ఉంటుందని మంత్రి సురేష్ తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చటంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని సబ్ కలెక్టర్ అన్నారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు సబ్ కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.