రోడ్డుప్రమాదంలో వరదయ్య పాలెం మండలం విట్టయ్యపాలెం కు చెందిన జూనియర్ లైన్ మెన్ దొరబాబు దుర్మరణం
పెళ్ళైన నాలుగు నెలలకే కుటుంబంలో అంతులేని విషాదం
వరదయ్యపాలెం మండలం బత్తులవల్లం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎన్ కండ్రిగ మండలం వరత్తూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో జూనియర్ లైన్ మెన్ గా పని చేస్తున్న విట్టయ్యపాలెం కు చెందిన దొరబాబు (25) దుర్మరణం పాలయ్యారు.
బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని తన మోటార్ బైక్ లో ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో శ్రీకాళహస్తి_తడ రహదారి మార్గంలో బత్తులవల్లం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.
తలకు హెల్మెట్ వేసుకున్నా.. లారీ చక్రాలు తలపై ఎక్కడంతో మృతి చెందాడు. దొరబాబు కు నాలుగు నెలల కిందటే వివాహం అయింది.
పెళ్ళైన నాలుగు నెలలకే విధి వక్రించి ప్రమాదం పొట్టన పెట్టుకుని దొరబాబు మృత్యు ఒడిలోకి చేరడంతో అతని కుటుంబం వీధిన పడింది. ఈ దుర్ఘటన గ్రామంలో విషాదాన్ని నింపిoది
ఎస్సై నాగార్జున రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.