'ఆ రోజు కాళ్లు పట్టుకుని అడుక్కున్నా'..చంద్రబాబుతో నిజం చెప్పించారుగా అంటున్న తెలుగు తమ్ముళ్లు

S7 News
0

Chandrababu Naidu Bala Krishna Unstoppable షోలో గెస్ట్‌గా వెళ్లారు. రాజకీయాలతో పాటూ సరదా సంభాషణలతో ప్రోమో అదిరిపోయింది. చంద్రబాబుతో పాటూ నారా లోకేష్ కూడా షోలో సందడి చేశారు. కాస్త ఘాటైన ప్రశ్నలు.. మధ్య, మధ్యలో సరదా కబుర్లతో ప్రోమో కొనసాగింది. ముఖ్యంగా ఈ ప్రోమోలో చంద్రబాబుపై వస్తున్న వెన్నుపోటు ఎపిసోడ్ విమర్శల ప్రస్తావన హైలైట్ అయ్యింది. అలాగే రాజశేఖర్ రెడ్డితో ఉన్న స్నేహాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

 

ప్రధానాంశాలు:

  • బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు
  • ప్రోమోలో ఆ ఒక్క అంశమే హైలైట్ చేస్తున్నారు
  • ఎపిసోడ్‌లో మొత్తం క్లారిటీ ఇచ్చేస్తారా అనే చర్చ
నందమూరి బాలయ్య (Nandamuri Bala Krishna) అన్‌స్టాపబుల్ 2 (Unstoppable 2) షో ప్రోమో వచ్చేసింది. సీజన్ 2లో మొదటి గెస్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. సరదాగా సాగే ఈ షోలో రాజకీయాలతో పాటూ కొన్ని ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబును ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న వెన్నుపోటు విమర్శల అంశం కూడా మరోసారి తెరపైకి వచ్చింది. అప్పటి పరిణామాలపై ఎమోషనల్ అయ్యారు. 'ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా' అంటూ బాలయ్యను చంద్రబాబు ప్రశ్నించారు. ఆ రోజు ఇంకా తనకు గుర్తు ఉందని బాలయ్య అంటే.. కాళ్లు పట్టుకుని అడుక్కున్నా తన మాట వినమని అడిగానని చంద్రబాబు అన్నారు. తన జీవితంలో ఆయన ఆరాధ్య దైవం అంటూ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు.

ఈ ప్రోమోను బట్టి చూస్తే.. చంద్రబాబు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపిన సమయంలో ఏం జరిగింది.. నందమూరి వారసులు చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇచ్చారో క్లారిటీ వచ్చేలా ఉంది. ఎపిసోడ్‌లో వెన్నుపోటు అనే విమర్శలకు చెక్ పెట్టేలా.. అంతేకాదు ఆ రోజు ఏం జరిగిందో వివరణ ఇస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)ప్రస్తావన వచ్చింది. ఇద్దరం చాలా మంచి స్నేహితులమని.. ఇద్దరూ కలిసి ఎన్నో అల్లరి పనులు కూడా చేశామంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇద్దరి స్నేహం.. ఆ తర్వాత రాజకీయాల్లో పరిణామాలపై ఈ షోలో చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ప్రోమో తర్వాత ‘అన్‌స్టాపబుల్‌లో NTR వెన్నుపోటు, దీని గురించి చంద్రబాబు మాట్లడకుండా ఉండటం వలన ఎవరికి తోచింది వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు, నాడు ఏమి జరిగిందో నేడు ఆయన మాటల్లోనే చెప్పించారు.. Good Decision’ అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
అంతేకాదు నారా లోకేష్ విదేశాల్లో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటో ప్రస్తావన కూడా వచ్చింది. ఈ ఫొటో అసెంబ్లీ వరకూ వెళ్లింది.. ఈ ఫొటోపై స్పందన ఏంటి బావా అంటూ చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు. ‘మామకి లేని సందేహం నాకెందుకు’ అంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అలాగే లోకేష్ మంగళగిరిలో ఓడిపోయిన విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు. ‘మంగళగిరి.. ప్రజా ప్రతినిధుల సభకు వెళ్లాలనే మొదటి అడుగు.. ఓడిపోయావ్.. ఎందుకు?’అని ప్రశ్నించారు. ‘సంకల్పంతో ఆనాడు వెళ్లాను’ అంటూ లోకేష్ వివరణ ఇచ్చారు. అన్‌స్టాపబుల్ ప్రోమో మాత్రమే వచ్చింది.. ఈ నెల 14న ఫుల్ ఎపిసోడ్ రిలీల్ కాబోతోంది. ఆ రోజు కచ్చితంగా చంద్రబాబు అన్ని అంశాలపై మొత్తం క్లారిటీ ఇవ్వబోతున్నారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top