తిరుచానూరు పంచాయతీకి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహా పాదయాత్ర..

S7 News
0

 తిరుచానూరు పంచాయతీకి..

* చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహా పాదయాత్ర..

* సర్పంచ్ రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో స్వాగతం

* పాదయాత్రకు సంఘీభావంగా..

* సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం.. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానంద రెడ్డి హాజరు

* గడప గడపన విశేష ఆదరణ
తిరుపతి

తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి భారీ స్థాయిలో స్వాగతం పలికారు. తిరుచానురు పంచాయతీ పరిధిలోకి గురువారం ప్రవేశించిన మోహిత్ రెడ్డి 7వ రోజు గడప గడపకు మహా పాదయాత్ర కార్యక్రమానికి పంచాయతీ సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆహ్వానం లభించింది. ఎంపీపీ మోహిత్ రెడ్డికి గజమాలను క్రేన్ ల సాయంతో  వేశారు.. దారి పొడువునా పూల జల్లులు కురిపించారు. అంతే కాకుండా రెండు కిలోమీటర్ల మేర బాణసంచా పేలుళ్ల మోత మోగించారు. అట్టహాసంగా సాగిన స్వాగత కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. డప్పులు శబ్దం మారుమ్రోగింది.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు జయహో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ స్వాగతించారు. తిరుచానూరు పంచాయతీ పరిధిలోని చైతన్యపురం, రాజీవ్ నగర్, అంబేద్కర్ కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీలలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటించారు.


ముఖ్య అతిథుల సంఘీభావం.. 

ఈ మహా పాదయాత్రలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంఘీభావంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో పాటు ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానంద రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు బీరేంద్రవర్మ కూడా హాజరయ్యారు.. మోహిత్ రెడ్డితో పాటు మహా పాదయాత్రలో పాల్గొన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకమవడం గొప్ప నాయకుడి లక్షణంగా అభివర్ణించారు.తండ్రికి తగ్గ తనయుడిగా భవిష్యత్తు రాజకీయాలలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 


గడప గడపన ఆప్యాయత 

గడప గడపకు మహా పాదయాత్రలో భాగంగా ఇంటింటికి పర్యటించిన మోహిత్ రెడ్డికి ప్రజలు ఆప్యాయంగా ఆహ్వానించారు. తమ వినతులను తెలియజేశారు. ప్రజలతో మమేకమైన మోహిత్ రెడ్డి వారి వినతులు స్వీకరిస్తూ.. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతూ.. పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు కూడా తమకు వచ్చిన పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలలో ఉన్న చిన్న పాటి పారిశుద్ధ్య సమస్యలను ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీ అధికారులను ఆదేశిస్తూ.. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. రూ.17 లక్షల వ్యయంతో లక్ష్మీనగర్ లో వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.


సంక్షేమ పథకాల పట్ల విశేష ఆదరణ

సీఎం జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మెరుగైన ఆదరణ ఉందన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు చెబుతుంటే గర్వంగా ఉందన్నారు. ప్రజల కోసం పరితపించే జగనన్న ప్రభుత్వానికి 2024 ఎన్నికలలో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం జగనన్న, ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చెవిరెడ్డి కట్టుబడి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల వైస్ ఎంపీపీలు యశోద, మాధవ రెడ్డి, ఎంపీటీసీ లు నరేష్,  శివశంకర్, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, మునీంద్రా, యోగానంద, వైఎస్ఆర్సీపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి,  మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top