మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు..

S7 News
0
మాస్కో నగరం నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాస్కో నుంచి ఢిల్లీకి గురువారం అర్ధరాత్రి వచ్చిన విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు.ఢిల్లీ విమానాశ్రయంలో మాస్కో విమానం తెల్లవారుజామున 3.20 గంటలకు దిగింది. విమానం ల్యాండింగ్ అవగానే విమానంలోని ప్రయాణికులు, విమాన సిబ్బందిని వెంటనే దించి వేశారు అధికారులు. అనంతరం విమానంలో తనిఖీలు జరిపారు ఢిల్లీ పోలీసులు. మాస్కో నుంచి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ రావడంతో విమానాశ్రయంలో అలర్ట్ ప్రకటించి సోదాలు జరిపారు. అయితే..ఇప్పటి వరకు ఎలాంటి బాంబును కానీ.. పేలుడు పదార్థాలు దొరకలేదు. ఇదిలా ఉంటే… గత వారం రోజుల క్రితం.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్ జౌ వెళుతున్న విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో బాంబు బెదిరింపు ఎదుర్కొంది.
దాంతో భారత్ లో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ సమయంలో ఇరాన్ విమానం ఢిల్లీకి చేరువలో ఉంది. తమ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందంటూ ఆ విమాన పైలెట్ ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. అయితే, అధికారులు ఆ విమానాన్ని జైపూర్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలని సూచించారు. అటు, భారత వాయుసేన కూడా వెంటనే స్పందించి ఆ విమానానికి రక్షణగా రెండు యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపింది. అయితే ఆ ఇరాన్ విమాన పైలెట్ జైపూర్ లో ల్యాండింగ్ చేయకుండా, భారత గగనతలాన్ని వీడి ప్రయాణాన్ని కొనసాగించాడు. కాగా, ఆ విమానాన్ని ఓ ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ట్రాక్ చేయగా, చైనా గగనతలంలో ఉన్నట్టు వెల్లడైంది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top