బుట్టాయిగూడెం అక్టోబర్ 12.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల త్యాగాల వలన నిర్మితమవుతుందని ప్రగల్బాలు పలికే ప్రజా ప్రతినిధులు నిర్వాసిత సమస్యలను గాలికి వదిలేస్తున్నారని నిర్వాసితుల సంఘం నాయకులు వై.నాగేంద్రరావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ లు విమర్శించారు. బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద బుధవారం కుక్కునూరు మండలం బెస్తగూడెం , చిగురుమామిడి పునరావాస గ్రామస్తులు నిరసన తెలిపారు. ఐటిడిఏ పి ఓ జీ శ్రీను కుమార్ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెస్తగూడెం గ్రామం 45.5 ముప్పు గురవుతుందని ప్రభుత్వం లెక్కలు తెల్చిoదన్నారు .కానీ 41.5 కే గ్రామo మునిగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి పలుసార్లు గోదావరి వరద గ్రామాన్ని చుట్టుముట్టిందనీ ఈ వరదల ఆధారంగా 41.5 వ కాంటూర్లోకి బెస్తగూడెం గ్రామాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. గోదారి వరదల కారణంగా గ్రామాల్లో పనులు లేక వలసలు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారని అన్నారు .వరద సాయం గ్రామంలో కొందరికి రాలేదని పూర్తిస్థాయిలో అర్హులను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలం ముప్పిన వారి గూడెం సమీపంలో చిగురు మామిడి వసంతవాడ బాలపల్లి శ్రీరాంపురం గ్రామాలకు నిర్మించిన నరవాస కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు 600 ఇళ్లకు ఒకే ఒక్క మంచినీటి ట్యాంకు ఉందని ఆ ఒక్కటి పనిచేయడం లేదని ఇళ్లకు ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. పునరావాస కేంద్రo చుట్టూ వరద నీరు వెళ్ళినందుకు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లల్లోనే నిలిచిపోతుందని దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. గ్రామంలో రేషన్ బియ్యం ఇక్కడే పంపిణీ చేయాలని వారు సూచించారు. ఈ సమస్యలపై ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి జి శ్రీను కుమార్ మాట్లాడుతూ బెస్తగూడేం గ్రామాన్ని సర్వే చేసేందుకు ఉన్నత అధికారులకు తెలియజేస్తానని తెలిపారు.చిగురుమామిడి పునరావాస కేంద్రాన్ని తాను పరిశీలించి మౌళిక సదుపాయాల కల్పిస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెస్తగూడెం చిగురుమామిడి గ్రామాలనిర్వాసితులు పాల్గొన్నారు