ప్రకాశం జిల్లా కొమరోలు మండలం మొట్టుపల్లి గ్రామంలో బుధవారం జిల్లా మెడికల్ అసోసియేషన్ ఈసి సభ్యుడు డాక్టర్ దివాన్ భాషా పేద ప్రజలకు వైద్య పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు
👉పేదలకు ఉచితంగా మందులు పంపిణీ
👉ప్రకాశం జిల్లా కొమరోలు మండలం మొట్టుపల్లి గ్రామంలో బుధవారం జిల్లా మెడికల్ అసోసియేషన్ ఈసి సభ్యుడు డాక్టర్ దివాన్ భాషా పేద ప్రజలకు వైద్య పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించినట్లు డాక్టర్ దివాన్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దివాన్ భాషా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ప్రజలకు చెప్పారు. పేదలకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.