* హనిమిరెడ్డి పల్లిలో 'గడప గడపకు మన ప్రభుత్వం'
* పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ:
బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, వైస్సార్సీపీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.