ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌కు బాహుబలితో వచ్చిన హ్యూజ్ క్రేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో సినిమా అంటే అది పెద్ద ప్రాజెక్టే అవుతోంది. అయితే వరుసగా పెద్ద సినిమాలు చేస్తుండడంతో డార్లింగ్‌కి బోర్ కొట్టిందేమో కానీ, టాలీవుడ్‌లో ఓ మీడియం రేంజ్ దర్శకుడికి చాన్స్ ఇచ్చాడు ప్రభాస్. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆ డైరెక్టర్‌తో సినిమా వద్దని మొత్తుకుంటున్నారు.
బాహాబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా ఈ రెబల్ స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ ప్రమోషన్లతో డార్లింగ్ ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ తర్వాత ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ అశ్విన్‌తో ప్రాజెక్ట్ కె, సందీప్ వంగాతో స్పిరిట్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్. అయితే ఆ తర్వాత మారుతీతో ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ మారుతీ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది కానీ, ఆయన ఇప్పటి వరకు పెద్ద స్టార్లను హ్యాండిల్ చేయలేదు. గతంలో వెంకటేష్‌తో తీసిన బాబు బంగారం ప్లాప్ అయ్యింది. ఇటీవల గోపీచంద్‌తో తీసిన పక్కా కమర్షియల్‌లో కూడా మారుతీ మ్యాజిక్ పనిచేయలేదు. దీంతో గోపీచంద్ ఖాతాలో మరో ప్లాప్ పడింది. ఇలాంటి టైమ్‌లో ప్రభాస్ ఇప్పుడు మారుతీకి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళణ చెందుతున్నారు.
అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యిందంటే.. మారుతీ చెప్పిన హార్రర్ అండ్ కామెడీ జోనన్ స్టోరీ ప్రభాస్‌కి నచ్చిందట. ఇప్పటి వరకు ప్రభాస్ హార్రర్ జోనర్‌ని టచ్ చేయలేదు. దీంతో దర్శకుడు మారుతీ చెప్పిన లైన్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేశాడంట ప్రభాస్. మరోవైపు మారుతీకి గతంలో ప్రేమ కథా చిత్రం లాంటి కామెడీ హార్రర్ సినిమా తీసిన అనుభవం ఉంది. కానీ ఆ మూవీ మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రం. ఆ సినిమాలో నటించిన వాళ్ళు కూడా స్టార్స్ కాదు.. అనుకోకుండా లక్ కలిసి వచ్చి ఆ సినిమా హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ప్రభాస్ రేంజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. ప్రభాస్‌తో మూవీ అంటే మేకర్స్ అండ్ డైరెక్టర్స్ భారీ చిత్రాలే ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ మినిమం మూడు నుండి ఐదు కోట్లు ఉంటున్నాయి ప్రస్తుతం డాల్లింగ్ నటిస్తున్న చిత్రాలు. ఇలాంటి టైమ్‌లో ప్రభాస్ ఇప్పుడు మారుతీతో సినిమా అంటే.. వద్దు బాబోబ్ అంటూ ఆయన ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఇద్దరు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి, ప్రభాస్ తన ఖాతాలో డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ఇక ఆదిపురుష్ విషయం అంటారా టీజర్ విడుదల తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఆ సినిమా పై ఆశలు వదులు కున్నారు. ఇప్పుడు మారుతీతో సినిమా అంటే మాత్రం రెబల్ అభిమానులు ఆందోళణ చెందుతున్నారు. వయితే ప్రభాస్ మాత్రం ఒక్కసారి మాట ఇచ్చాడంటే వెనకడుగు వేయడు. మరి మారుతీతో సినిమా ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేది చూడాలి.