Cab Service: మందుబాబులకు గోవా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మందుబాబులకు తప్పనిసరిగా క్యాబ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగిన వారిని తమ సొంత వాహనాల్లో పంపించకూడదని, వారికి క్యాబ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమ కస్టమర్లకు క్యాబ్ ను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బార్లు, రెస్టారెంట్లు, క్లబ్‌ల యాజమాన్యాలపై ఉందని గోవా రవాణశాఖ మంత్రి స్పష్టం చేశారు. అందరూ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
ప్రధానాంశాలు:
- మందుబాబులకు క్యాబ్ సర్వీసులు
- బార్లు, రెస్టారెంట్స్‌లకు గోవా ప్రభుత్వం కొత్త నిబంధన
- సురక్షితంగా ఇంటికి పంపాలని ఆదేశాలు