Chiranjeevi రాష్ట్ర ఆస్తి.. నేను క్షమించను: రామ్ గోపాల్ వర్మ

S7 News
0

 

Chiranjeevi: సద్దుమణిగిన వివాదానికి వరుస ట్వీట్లతో ఆజ్యం పోశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన వరుస ట్వీట్లతో చిరంజీవి, గరికపాటి నరసింహారావు వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే, అకస్మాత్తుగా రామ్ గోపాల్ వర్మకి చిరంజీవి మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నించారు. ఎందుకంటే, ఆ ట్వీట్లలో రామ్ గోపాల్ వర్మ భజన ఆ రేంజ్‌‌లో ఉంది మరి. వర్మ మెగా వివాదం గురించి తెలిసిన ఎవరైనా ఆ ట్వీట్లు చూస్తూ ఆశ్చర్యపోక మానరు.

 
RGV about Chiranjeevi
రామ్ గోపాల్ వర్మ, చిరంజీవి

ప్రధానాంశాలు:

  • చిరంజీవి, గరికపాటి అంశంపై మళ్లీ స్పందించిన వర్మ
  • నాగబాబు క్షమించినా తాను క్షమించనన్న దర్శకుడు
  • ‘అడవి’ ప్రెస్ మీట్‌లో ఈ వివాదం గురించి ప్రస్తావన
Chiranjeevi: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వర్మ ఈ వివాదంపై మాట్లాడారు. గరికపాటి నరసింహారావు పేరును తన ట్వీట్లలో రకరకాలుగా ప్రస్తావించడాన్ని మీడియా ప్రశ్నించగా.. ఆయన ఒరిజినల్ పేరు తనకు తెలీదని, అందుకే అలా ప్రస్తావించానని ఎప్పటిలాగే తనదైన శైలిలో సమాధానమిచ్చారు వర్మ. సద్దుమణిగిపోతున్న వివాదానికి ట్వీట్లతో మీరు ఎందుకు ఆజ్యం పోసారని అడగగా.. తనకు సమాచారం ఆలస్యంగా వచ్చిందని, అందుకే ఆ సమయంలో స్పందించానని వివరణ ఇచ్చారు.

నాగబాబు ట్వీట్‌ను సైతం రీట్వీట్ చేశారు కదా అని ఓ పాత్రికేయుడు అడగగా.. ‘‘నా పాయింట్‌లో చిరంజీవి గారు రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి. ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదు. అందుకని నాగబాబు గారు క్షమించొచ్చు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్. మేం మాత్రం క్షమించమని ట్వీట్‌లో చెప్పాను’’ అని మరోసారి వర్మ కుండబద్దలుకొట్టారు. అదే ప్రెస్ మీట్‌లో వర్మతో పాటు పాల్గొన్న నిర్మాత నట్టి కుమార్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. గరికపాటి నరసింహారావు చిరంజీవికి క్షమాపణ లేఖ పంపారని అంటున్నారని, అలాంటి ఒక లేఖను నేను సోషల్ మీడియాలో చూశానని అన్నారు. మరి అది నిజమో కాదో తనకు తెలీదన్నారు. ఏదేమైనా ఆ సమయంలో చిరంజీవిని గరికపాటి నరసింహారావు ఆ మాట అనకూడదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.
గరికపాటి నరసింహారావును హేళన చేస్తూ.. ‘హే గారికపీటి, హే గూగురుపాటి’ అంటూ సోమవారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు రామ్ గోపాల్ వర్మ. గరికపాటి నరసింహారావును మెగా అభిమానులు ఏమీ అనవద్దంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘‘ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలె...’’ అని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా.. ‘‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’’ అని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇలా ఇంకా మరికొన్ని ట్వీట్లు సంధించారు. అయితే, ఈ ట్వీట్లు చూసిన నరసింహారావు అభిమానులు వర్మను తిట్టిపోశారు. గరికపాటిని అనేంతవాడివా నువ్వు, నీకు అంత అర్హత లేదంటూ దుయ్యబట్టారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top