తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM stalin) కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. హిందీ తమపై తప్పనిసరి చేసి.. మరో భాషా యుద్ధానికి శ్రీకారం చుట్టవద్దని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన లేఖ రాశారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని, అన్ని భాషలను సమానంగా చూడాలని లేఖలో పేర్కొన్నారు. హిందీని తప్పనిసరి చేయడాన్ని ఆపాలని ప్రధాన మంత్రి, ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం నుంచి కూడా ఇదే స్పందన వచ్చింది.
ప్రధానాంశాలు:
- కేంద్రానికి సీఎం స్టాలిన్ లేఖ
- హిందీని తప్పనిసరి చేయవద్దని వినతి
- మరో భాషా యుద్ధాన్ని తీసుకురావొద్దన్న స్టాలిన్