Definition of marriage: పెళ్లి గురించి రాసిన విద్యార్థి... సూపర్ అంటున్న నెటిజన్లు.. ఫుల్ మార్క్స్ వేయాలని డిమాండ్

S7 News
0

సోషల్ పరీక్షలో పెళ్లి గురించి నిర్వచించమని ( Definition of marriage) అడిగిన ప్రశ్నకు.. ఓ విద్యార్థి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సమాధానానికి టీచర్ షాక్ తిని.. సున్నా మార్కులు ఇచ్చినా.. నెటిజన్లు మాత్రం పదికి పది మార్కులు వేసేశారు. పైగా ఫుల్ మార్క్స్ వేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆ అబ్బాయి రాసిన సమాధానం ఆ రేంజ్‌లో ఉంది మరీ. దానిని చూసిన వారు నవ్వకుండా ఉండలేరు. ఆ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 
student wrote definition of marriage

ప్రధానాంశాలు:

  • సోషల్ పరీక్షలో పెళ్లిపై ప్రశ్న
  • విద్యార్థి రాసిన జవాబుకు టీచర్ షాక్
  • వైరల్ అవుతున్న విద్యార్థి ఆన్సర్ షీట్
Definition of marriage: కొన్ని సందర్భాల్లో పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు విద్యార్థులు రాసే సమాధానాలు.. టీచర్ల మైండ్‌ను బ్లాక్ చేస్తున్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అమాయకత్వంతోనో.. అతి తెలివితోనో పిల్లలు రాసే జవాబులకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల సోషల్ ఎగ్జామ్‌లో పెళ్లి గురించి.. రాయమంటే ఓ విద్యార్థి రాసిన సమాధానం అలానే ఉంది.

సోషల్ పరీక్షలో 10 మార్కులకు కోసం పెళ్లి గురించి నిర్వచించమని (definition of marriage) ఓ ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్నకు ఓ విద్యార్థి.. ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది. పిల్లవాడి జవాబు పత్రం (answer sheet) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది చదివిన వారు షాక్ అవ్వడమే కాదు.. నవ్వకుండా ఉండలేరు. కానీ ఆ విద్యార్థి మాత్రం ఆ ప్రశ్నకు తనకు తెలిసినంత మేరకు.. చాలా నిజాయితీగా తన అభిప్రాయాన్ని రాసినట్టు అర్థం అవుతుంది.

ఇంతకీ ఏం రాశాడంటే.. "తల్లిదండ్రులు తమ కుమార్తె "పెద్ద" మహిళగా భావించినప్పుడు వివాహం జరుగుతుందని పేర్కొన్నాడు. "మేము మీకు తిండి పెట్టలేం. మీకు తిండి పెట్టగలిగే వ్యక్తి దగ్గరకు వెళ్లండని తల్లిదండ్రులు ఆ అమ్మాయికి చెబుతారు. దాంతో ఆ అమ్మాయి అలాంటి వ్యక్తిని కలుసుకుంటుంది. వెంటనే తల్లిదండ్రులు నువ్వు పెద్దదానివి.. అతనిని పెళ్లి చేసుకోమని అరుస్తారు." అని రాసుకొచ్చాడు. దాంతో ఆ అమ్మాయి.. అబ్బాయి ఒకరినొకరు పరీక్ష చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారని పేర్కొన్నాడు.



Read Also:తగ్గేదే లేదంటున్న రాహుల్ గాంధీ... నడి రోడ్డుపై బాలుడితో పోటీ

పేపర్‌లో విద్యార్థి రాసిన ఈ సమాధానాన్ని చూసిన టీచర్‌‌కి‌ కోపం వచ్చినట్టు తెలుస్తుంది. దాంతో 10 కి సున్నా మార్కులు వేయడంతో పాటు "అర్థం లేనిది" (Nonsense) అని రాశారు. అయితే ఆ సమాధాన పత్రాన్ని వేలు అనే యూజర్ దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. పెళ్లి గురించి విద్యార్థి ఇచ్చిన నిర్వచనం నెటిజన్లకు మాత్రం తెగ నచ్చేసింది. ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. పిల్లవాడి సమాధానం కరెక్టేనని.. ఎందుకు మార్కులు ఇవ్వలేదని కూడా కొందరు డిమాండ్ చేశారు.


వాస్తవానికి వివాహం గురించి నేను ఇప్పటివరకు చూసిన మంచి వివరణ.. అని ఒకరు కామెంట్ పెట్టగా.. చాలా ఫన్నీగా ఉందని మరికొందరు కామెంట్‌లు పెట్టారు. కొందరైతే ఆ అబ్బాయి రాసిన సమాధానానికి 10 కి 10 మార్కులు ఇవ్వాలన్నారు. ఇందులో అబద్ధం ఎక్కడుందని కూడా కామెంట్ చేశారు. పిల్లవాడు నిజం రాసినందుకు కనీసం 5 మార్కులన్న ఇవ్వాలని, అందులో అబద్ధం ఎక్కడుందని కొందరు ప్రశ్నించారు. అంతేకాదు పిల్లవాడు నిజాయితీపరుడని, నిజం చెప్పాడని కూడా కొందరు పేర్కొన్నారు. మొత్తానికి ఆ అబ్బాయి సమాధానానికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top