Janasena Party వీర మహిళలకు నమస్కారం.. ప్లీజ్ క్లారిటీ ఇవ్వండి: మంత్రి అంబటి రాంబాబు

S7 News
0

Ambati Rambabu మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ను టార్గెట్ చేశారు. జనసేన పార్టీ (Janasena Party)వీర మహిళల వీడియోలకు కౌంటర్‌గా సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివరంగా వివరించగలరా అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను సీఎంను చేయాలనా అంటూ ట్వీట్ చేశారు. మంత్రికి జనసైనికులు కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తున్నారు. జనసేన, వైఎస్సార్‌సీపీ మధ్య ట్విట్టర్‌లో పెద్ద వార్ నడుస్తోంది.

 

ప్రధానాంశాలు:

  • మంత్రి అంబటి రాాంబాబు మరో ట్వీట్
  • పవన్‌ను సీఎం చేయాలనా అంటూ ప్రశ్న
  • జనసేన వీర మహిళల్ని ప్రశ్నించిన మంత్రి
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వరుస ట్వీట్‌లు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. జగన్ సర్కార్ టార్గెట్‌గా మూడు రోజులుగా ఈ వార్ కొనసాగిస్తున్నారు. జనసేనాని చేస్తున్న ట్వీట్‌లకు ఏపీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు కౌంటర్‌లు ఇస్తున్నారు. అధికార పార్టీ నేతలకు జనసేన పార్టీ కూడా అదే రేంజ్‌లో రియాక్షన్ ఇస్తోంది. తాజాగా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ఋ‌ను మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ట్విట్టర్ వేదికగా టార్గెట్ చేశారు.

  • ‘జనసేన వీర మహిళకు నమస్కారం! బాబుని అందలం ఎక్కించాలనా?.. కళ్యాణ్ బాబుని సీఎంని చేయాలనా?.. ఏమిటి మీ ప్రయత్నం?.. వివరంగా వివరించగలరా ?’అంటూ ప్రశ్నించారు. జనసేన వీర మహిళలు ఏపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇస్తూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వారికి కౌంటర్‌గా మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు.

మంత్రి అంబటికి జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసేశాఖ కాదని.. నీటిపారుదలశాఖ అని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. నీటి పారుదల శాఖ అని గుర్తు చేయాలని వీర మహిళల ప్రయత్నం అన్నారు. ప్రజలు బాగా అర్థమయ్యేటట్టు 2024లో చెబుతారులే.. అప్పుడు దాకా భజన కార్యక్రమాన్ని ముందుకు సాగించండి అంటూ ఎద్దేవా చేశారు. మంత్రి అంబటి రాంబాబు విశాఖపట్నం వస్తే తెలుస్తుందని మరికొందరు కామెంట్ చేశారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top