Jio 5G vs Airtel 5G: దేశంలో 5జీ స్పీడ్ వివరాలు వెల్లడి.. ఎక్కువ వేగం ఏదంటే..

S7 News
0

Reliance Jio 5G vs Airtel 5G: జియో 5జీ, ఎయిర్‌టెల్‌ 5జీ స్పీడ్ టెస్ట్ వివరాలు బయటికి వచ్చాయి. నాలుగు నగరాల్లో ఈ టెలికం సంస్థల 5జీ నెట్‌వర్క్‌లో గరిష్ట డౌన్‌లోడ్ స్పీడ్ వివరాలను ప్రముఖ సంస్థ ఊక్లా తన రిపోర్ట్‌లో వెల్లడించింది.

 
5G Speed Test Results
ప్రస్తుతం దేశంలో 5జీ క్రేజ్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్ (5G Network) ప్రారంభంతో టెక్నాలజీ రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలి దశలో ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel).. దేశంలోని ఎనిమిది నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. నాలుగు సిటీస్‌లో టెస్టింగ్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను లాంచ్ చేసింది. ఈ తరుణంలో ఈ రెండు టెలికం సంస్థలు ఆ నగరాల్లో ఇస్తున్న 5జీ స్పీడ్‌ల గురించి వివరాలు బయటికి వచ్చాయి. ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్‌ వెబ్‌సర్వీస్‌ను అందిస్తున్న ఊక్లా (Ookla).. జియో 5జీ, ఎయిర్‌టెల్‌ 5జీ స్పీడ్‌లను (Jio 5G Speed vs Airtel 5G Speed) వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్‌కతాలో ఎంత వేగంతో ఇంటర్నెట్ వస్తున్నదో వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి 5జీ ప్రాథమిక దశలోనే ఉంది. భవిష్యత్తులో ఈ వేగాలు మారొచ్చు. కాగా, ఆ నాలుగు నగరాల్లో జియో 5జీ, ఎయిర్‌టెల్‌ 5జీ వేగం గురించి ఓక్లా వెల్లడించిన గణాంకాలు ఇవే.

ఢిల్లీలో గరిష్ట డౌన్‌లోడ్ స్పీడ్
  • జియో 5జీ - 598.58 Mbps
  • ఎయిర్‌టెల్‌ 5జీ - 197.98 Mbps
ముంబైలో గరిష్ట డౌన్‌లోడ్ వేగం
  • జియో 5జీ - 515.38 Mbps
  • ఎయిర్‌టెల్‌ 5జీ - 271.07 Mbps
కోల్‌కతాలో గరిష్ట డౌన్‌లోడ్ స్పీడ్
  • జియో 5జీ - 482.02 Mbps
  • ఎయిర్‌టెల్‌ 5జీ - 33.83 Mbps
వారణాసిలోమ్యాగ్జిమమ్ డౌన్‌లోడ్ వేగం
  • జియో 5జీ - 485.22 Mbps
  • ఎయిర్‌టెల్‌ 5జీ - 516.57 Mbps
రిలయన్స్ జియో 5జీ, ఎయిర్‌టెల్‌ 5జీకి చెందిన ప్రస్తుత గరిష్ట వేగం వివరాలు ఇవి. అయితే ఇవి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం రెండు టెలికం సంస్థలు ప్రయోగాత్మకంగానే 5జీని తీసుకొచ్చాయి. ఇప్పటికీ 5జీ సపోర్ట్ ఉన్న చాలా మొబైల్స్ 5జీకి ఎనేబుల్ అవలేదు. అప్‌డేట్‌ రావాల్సి ఉంది. అలాగే నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరిచేందుకు, లోపాలు ఏవైనా ఉంటే సరిదిద్దేందుకు టెలికం సంస్థలు కూడా పని చేస్తున్నాయి. అందుకే 5జీ వేగాల్లో మార్పులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Ookla 5G Speed Test

(Photo: Ookla)

ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి నగరాల్లో ఈనెల 5వ తేదీన జియో ట్రూ 5జీని రిలయన్స్ జియో లాంచ్ చేసింది. టెస్టింగ్ కోసం బీటా సర్వీస్‌లను అక్కడ అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనుంది. మరోవైపు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, వారణాసి, సిలిగుడి, చెన్నై, నాగ్‌పూర్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్ అందుబాటులోకి వచ్చింది. కోల్‌కతాలోనూ 5జీ సర్వీస్‌లను ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. అయితే అక్కడ పూర్తి స్థాయిలో రెడీ అయినట్టుగా లేదు. అందుకే ఆ నగరంలో జియో 5జీ, ఎయిర్‌టెల్‌ 5జీ మధ్య డౌన్‌లోడ్ వేగంలో అంత తేడా ఉంది. మొత్తంగా అయితే 4జీ కంటే.. 5జీలో 5 నుంచి 10 రెట్లు ఇంటర్నెట్ వేగం ఉంటుందని తెలుస్తోంది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top