Mahakal Lok Corridor జాతికి అంకితం.. ఉజ్జయినీ మహాకాళేశ్వర క్షేత్రం ప్రత్యేకతలివే

S7 News
0

 


Mahakal Lok Corridor: ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో మహాకాల్ లోక్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకింతం చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనది ఈ క్షేత్రం. దేశంలోని శివాలయాలన్నీ ఉత్తరాభిముఖంగా ఉంటే.. మహాకాలుని ఆలయ ముఖద్వారం మాత్రం దక్షిణాభిముఖంగా ఉంటుంది. గర్భగుడి శ్రీ చక్రయంత్రం తిరగవేసి ఉండటం మరో ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయంలో మహా కాళేశ్వరుడికి ప్రాత: కాలం భస్మాభిషేకం చేస్తారు. ఉజ్జయినీ ఆలయ విశిష్టతలు..


ధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుని ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ క్షేత్రం (Ujjain Mahakaleshwar Temple). నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. శివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. అలాంటి క్షేత్రం కీర్తి విశ్వంతరాలు దాటేలా మరింత అపురూపంగా తీర్చిదిద్దారు. మహాకాల్ లోక్ కారిడార్ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (అక్టోబర్ 11) సాయంత్రం.. పండితుల వేద మంత్రాల నడుమ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మహాకాల్ లోక్ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించారు. రూ. 856 కోట్ల వ్యయంతో ‘మహా కాళేశ్వర్‌ ఆలయ కారిడార్‌ ప్రాజెక్టు’ను చేపట్టారు. రూ. 316 కోట్లతో తొలి దశ పనులను పూర్తి చేశారు.

దేశంలోని శివాలయాలన్నీ ఉత్తరాభిముఖంగా ఉంటే.. ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయ ముఖద్వారం మాత్రం దక్షిణాభిముఖంగా ఉంటుంది. గర్భగుడి శ్రీ చక్రయంత్రం తిరగవేసి ఉండటం ఇక్కడి మరో ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయంలో మహా కాళేశ్వరుడికి ప్రాత: కాలం భస్మాభిషేకం చేస్తారు.

  • మహాకాల్ లోక్ ప్రాజెక్టు విశిష్టతలివే
★ భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని దశదిశలా చాటేలా ఈ క్షేత్రంలో నిర్మాణాలు చేపట్టారు.
★ ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే.. ఆలయ కాంప్లెక్స్‌ ఏడింతలు పెరుగనుంది. ప్రస్తుతం ఉన్న 2.87 హెక్టార్ల నుంచి 47 హెక్టార్ల విస్తీర్ణానికి విస్తరిస్తుంది.
★ ఎత్తైన శివుడి విగ్రహం, తామర చెరువు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
★ ఇక్కడి గోడలపై శివుడి ఆనంద నాట్య తాండవాన్ని 108 చిత్రాలతో అందంగా తీర్చిదిద్దారు.
★ పురాతణ కథలను వివరించే 93 విగ్రహాలను నిర్మించారు. గణేషుడి జననం, దక్షయజ్ఞం, శివపురాణం గాథలను కళ్లకు కట్టేలా ఆవిష్కరించారు. విగ్రహాలపై QR కోడ్‌ ఉంటుంది. భక్తులు కోడ్‌ను స్కాన్‌ చేయగానే విగ్రహానికి సంబంధించిన వివరాలు ఫోన్‌లో కనిపిస్తాయి.
★ ఇక్కడికి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం పొందడంతో పాటు ప్రకృతి ఒడిలో మైమరిచిపోయేలా క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.
★ వాహనాల పార్కింగ్‌కు, దుకాణాల సముదాయాలు, ఫుడ్ కోర్టులకు విశాలమైన ప్రాంతాన్ని కేటాయించారు.

★ శిప్రా నది తీరంలో ఉజ్జయినీ నగరం ఉంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 200 కి.మీ. దూరంలో మహాకాళేశ్వరుని ఆలయం ఉంది.
★ కాశీ విశ్వేశ్వరనాథ్‌ కారిడార్‌ కంటే ఇది 4 రెట్లు పెద్దది.
★ మహాకాల్ లోక్ కారిడార్‌ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top