MIG 29K Jet Crash: గోవాలో తీరంలో మిగ్-29 కె యుద్ధ విమానం“ కూలిపోయింది. మిగ్ 29-కె యుద్ధ విమానం తిరిగి స్థావరానికి వస్తుండగా గోవా తీరంలో కుప్పకూలింది.సాంకేతిక లోపం కారణంగా విమానం కూలినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో అందులో ఉన్న పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు నావికాదళం వర్గాలు తెలిపాయి.పైలట్ పరిస్థితి నిలకడగా ఉందని నేవీ ప్రకటించింది. సముద్రంలో పడిన విమానం కోసం గాలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ (BoI) ఆదేశించిందని భారత నావికా దళం ప్రకటించింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.