Three Capitals Issue: విశాఖలో పోటాపోటీ సమావేశాలు.. 15పై ఏపీలో హైటెన్షన్

S7 News
0

 

Three Capitals Issue: ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. విశాఖ వేదికగా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నడిపిస్తున్న కొత్త రాజకీయం రంజుగా మారింది. ఈ నెల 15న అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా విశాఖలో వైసీసీ గర్జన ర్యాలీ ఏర్పాటు చేసింది. అదే రోజు పవన్ విశాఖలో పర్యటించనుండటం హాట్ టాపిక్‌గా మారింది. 15న వైసీపీకి పోటీగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు విశాఖలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం కానున్నారు.

 
వైజాగ్

ప్రధానాంశాలు:

  • ఈ నెల 15న విశాఖలో పార్టీల పోటాపోటీ సమావేశాలు
  • వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ కీలక సమావేశం
  • ఏపీలో హైటెన్షన్ క్రియేట్ చేస్తోన్న పరిణామాలు
Three Capitals Issue: ఏపీ రాజకీయాలు ప్రస్తుతం విశాఖ వేదికగా నడుస్తున్నాయి. మూడు రాజధానులపై విశాఖలో వైసీపీ నడిపిస్తున్న కొత్త రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో కాక రేపుతోంది. మూడు రాజధానుల అంశం, అమరావతి రైతుల పాదయాత్ర చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేస్తున్న పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. అమారావతి రైతుల పాదయాత్రపై మంత్రులు, వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో దుమారం రేపుతోన్నాయి. రైతుల పాదయాత్రకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వారిని అడ్డుకోవడం, వారి పాదయాత్రలో మూడు రాజధానులుగా మద్దతుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

  • ఈ నెల 15న విశాఖకు చేరుకుంటున్న రైతుల పాదయాత్రకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ రెడీ అయింది. రైతుల పాదయాత్రకు పోటీగా 15న విశాఖలో గర్జన పేరుతో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఏర్పాటు చేసుకోవడంతో రాజకీయం రంజుగా మారింది. ఈ నెల 15,16,17వ తేదీల్లో విశాఖలో పవన్ పర్యటిస్తున్నట్లు జనసేన ఇప్పటికే అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. 15న ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్న పవన్.. 16,17న జనవాణి కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. వైసీపీ గర్జన ర్యాలీ సమయంలోనే విశాఖలో పవన్ అడుగుపెట్టనుండటంపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఆ రోజున పవన్ విశాఖ వస్తున్నారని, పర్యటనను వాయిదా వేసుకోవాలంటూ మంత్రి అమర్ నాథ్ కోరారు.

అయితే అదే రోజు విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ నేతలందరూ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, మాజీ జడ్పీ ఛైర్మన్‌లు, ఎంపీ అభ్యర్థులతో పాటు ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ చేస్తున్న పోరాటంపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. అమరావతికి మద్దతుగా ఉత్తరాంధ్రలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాన్ని ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

15వ తేదీన ఒకేరోజు విశాఖలో అమరావతి రైతుల పాదయాత్ర, వైసీపీ గర్జన సభ, పవన్ పర్యటన, టీడీపీ ఉత్తరాంధ్ర నేతల కీలక సమావేశం ఉండటం ఏపీ రాజకీయాల్లో హైటెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది. ఆ రోజు విశాఖ కేంద్రంగా ఏం జరగబోతుందనేది ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠభరితంగా మారింది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top