గంగమ్మ కు కమిషనర్ హరిత సారె సమర్పణ

S7 News
0తిరుపతి గ్రామ దేవత గంగమ్మ సారె సమర్పణ కార్యక్రమం  నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.తిరుపతి కమిషనర్ హరిత తన కుటుంబ సభ్యులతో కలసి సారె సమర్పించారు.  స్థానిక నిలామహల్ కూడలి వద్ద ఉన్న తన నివాసం నుంచి గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిషనర్, వారి కుటుంబ సభ్యులు పళ్లాలపై పసుపు, కుంకుమ,  పూలు, పళ్లు, రవిక, పట్టు చీరలను ఊరేగింపుగా   తీసుకొచ్చి  అమ్మ వారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  ఈ క్రమంలో భూమన నివాసం  నుంచి అమ్మవారి ఆలయం వరకు జనసందోహంగా మారింది. వీధులన్నీ వేపాకు తోరణాలతో పాటు మామిడి, అరటి తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ, కర్పూర హారతులిస్తూ  స్వాగతించారు.స్థానికులు పెద్ద ఎత్తున  గంధం బొట్లు పెట్టుకుని, వేపాకు చేతబూని, వివిధ వేషధారణలతో విచ్చేసి  భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి కీర్తనలతో, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ  పులకించి పోయారు.  గంగమ్మ నామ స్మరణతో తిరునగరి హోరెత్తింది. నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు,తీన్ మార్,  కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల కళాప్రదర్శలు ఆకట్టుకున్నాయి. వేసవి తీవ్రతను లెక్కచేయకుండా శోభా యాత్ర కొనసాగింది. 

Post a Comment

0Comments
Post a Comment (0)