మంత్రి ఉషశ్రీ చరణ్
నటి అనన్య
మంత్రి ఉషశ్రీ చరణ్,నటి అనన్య నాగళ్ళ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.