అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో భారీగా నగదు బయటపడింది. హైదరాబాద్ రెజిమెంటల్ బజార్ లోని ఓ ఇంట్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అనంతరం ఇంటిని పరిశీలిస్తుండటంతో సుమారు రూ. కోటిన్నర నగదు లభించింది. లభించిన డబ్బు హవాలాకు సంబంధించినదని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.