కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.. క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోవడంతో స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.