శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి

S7 News
0

శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శాస్త్ర యుక్తంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు  అంజూరు తారక శ్రీనివాసులు హనుమాన్ అభిషేక సేవలో పాల్గొన్నారు.  శ్రీకాళహస్తి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఆవరణం లోని 16 కాళ్ళ మండపంలో వెలిసి ఉన్న శ్రీ మారుతి విగ్రహానికి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశేష అభిషేక పూజలు చేపట్టారు. ఈ విశేష అభిషేక సేవకు ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు  అంజూరు తారక శ్రీనివాసులు హాజరయ్యారు.


తొలుత కలశ స్థాపన పూజలు జరిపి అనంతరం హనుమాన్ విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి చందనంతో విశేష అలంకారం చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి, పూర్ణ హారతులు సమర్పించారు. భక్తులు అభిషేక సేవను తిలకించి జై హనుమాన్ అంటూ స్వామి నామస్మరణలు చేస్తూ పరవశించారు. ఈ పూజాది కార్యక్రమంలో ఆలయ అధికారులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ వేద పండితులు మారుతి శర్మ, అర్చకులు తులసి, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)