తిరుపతి తాతయ్య కుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. గురువారం బండవేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు

S7 News
0


తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.. అందులో భాగంగా గురువారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి అర్చన అభిషేకాలుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు.



అనంతరం అమ్మవారికి వెండి తొడుగులు సుగంధ పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నగర ప్రజలు  చిన్న పెద్ద తారకమ్యం లేకుండా బండ వేషాలు వేసుకొని బూతులు తిడుతూ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.




వేయికళ్ల దుత్తను తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు.. ఆలయ పాలకమండలి సభ్యులు భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు..

Post a Comment

0Comments
Post a Comment (0)