రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో విజయవాడలోని ఆరు రోజులు పాటు మహా యజ్ఞం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పూతలపట్టు శాసనసభ్యులు ఎమ్మెస్ బాబు తెలిపారు. కాణిపాకం ఆలయం వద్ద అష్టోత్తర కుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహా యజ్ఞానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో సర్వతో ముఖాభివృద్ధి సమస్త రాష్ట్ర ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం పాడిపంటలు సమృద్ధి ప్రకృతి మాత అనుగ్రహం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఈనెల 12వ తేదీ నుంచి ఆరు రోజులు పాటు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మహా యజ్ఞానికి కాణిపాకం నుంచి ధర్మ ప్రచార రథం ,అర్చక వేద పండితులు సన్నాయి డోలు పంపనుట్లు వివరించారు .పూతలపట్టు నియోజకవర్గం నుంచి భక్తులు పాల్గొనాలని కోరారు