సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందమైన అమ్మాయిల ఫొటోలను డీపీలుగా పెట్టి కాల్స్ చేస్తున్నారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే అర్ధనగ్నంగా ఉన్న యువతి ప్రత్యక్షమవుతోంది. ఆమెతో ఫోన్ మాట్లాడుతుండగానే కాల్ను రికార్డ్ చేస్తున్నారు. కాల్ ముగిసిన తర్వాత రికార్డ్ను బాధితుడికి షేర్ చేస్తున్నారు. అయితే ఇలా ప్రతి పదిమందిలో ఐదుగురికి ఇలాంటి కాల్స్ వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని HYD పోలీసులు వెల్లడించారు.