అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్లోనే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరిగాయి. అయితే ఈ సినిమా మొదటిరోజు అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ టాక్ మాత్రం అందుకోలేకపోయింది.
కంటెంట్ పరంగా ఆడియన్స్ కు పూర్తిస్థాయిలో సినిమా కనెక్ట్ కాలేదు. రివ్యూ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో సినిమాకు మొదటి రోజు ఊహించినంత స్థాయిలో అయితే ఓపెనింగ్స్ రాలేదని అర్థమవుతుంది. ఇక మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ రావచ్చు అనే వివరాల్లోకి వెళితే...

కస్టడీ సినిమా టాక్: నాగచైతన్య కస్టడీ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే అతను నటించిన చివరి సినిమా థాంక్యూ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ఎంతో హార్డ్ వర్క్ చేసి మరి కస్టడీ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్య నటన బాగానే ఉన్నప్పటికీ సినిమా కథ అలాగే స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా ఉండటం వలన ఆడియన్స్ కు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే అనుకోవడం లేదు.

కస్టడీ వినిమా బిజినెస్: కస్టడీ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మంచి బిజినెస్ అయితే చేసింది. నైజాం లో ల 7.5 కోట్లు సీడెడ్ లో 2. 20 కోట్లు ఆంధ్ర మొత్తంలో 8.50 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి 18.21 ఓట్ల రేంజ్ లో అయితే ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం.
అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 1.2 కోట్లు, 2.4 కోట్ల రేంజ్ లో ఈ సినిమా అమ్ముడైనట్లు సమాచారం. తెలుగులో టోటల్ గా 21.80 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. ఈ సినిమా తమిళ వెర్షన్ 2.5 కోట్ల నుంచి మూడు కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే రెండు భాషల్లో కలుపుకొని కస్టడీ సినిమా 23.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసినట్లుగా తెలుస్తోంది.

తెలుగులో థియేట్రికల్ ఆక్యుపెన్సీ: ఇక కస్టడీ సినిమా మొదటి రోజు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. మొదటి షోకే ఈ సినిమాకు కాస్త డివైడ్ టాక్ రావడం వలన మధ్యాహ్నం షోల నుంచి థియేట్రికల్ ఆక్యుపెన్సి చాలా వరకు తగ్గిపోయింది. తెలుగులో ఉదయం షోలకు 24.31% మధ్యాహ్నం షోలకు 21.54% సాయంత్రం షోలకు 21.85% ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

తమిళంలో థియేట్రికల్ ఆక్యుపెన్సీ: ఇక తమిళంలో కూడా ఈ సినిమా 100కు పైగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే అక్కడ కూడా పెద్దగా పాజిటివ్ టాక్ ఏమీ అందుకోలేదు. తమిళంలో కస్టడీ సినిమా ఉదయం షో లకు 19.7% మధ్యాహ్నం షోలకు 24.60% సాయంత్రం షోలకు 20.89% నమోదు చేసుకుంది. తమిళంలో వెంకట్ ప్రభుకి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా కస్టడీ సినిమాకు మొదటిరోజు అంతగా హెల్ప్ అయితే అవ్వలేదు.
ఏపీ నైజాంలో: ఇక మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవచ్చు అని వివరాల్లోకి వెళితే.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు చాలా తక్కువ ఓపెనింగ్స్ అయితే అందే అవకాశం ఉంది. మొదటి రోజు ఏపీ నైజాంలో కలుపుకొని ఈ సినిమా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవచ్చు అనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మొత్తంగా ఎంత రావచ్చు అంటే: ఇండియా మొత్తంలో చూసుకుంటే కస్టడీ సినిమా మూడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కస్టడీ సినిమా 3.2 కోట్ల రేంజ్ నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇలా అయితే సినిమా టార్గెట్ ఫినిష్ అవ్వడానికి ఏమాత్రం సరిపోదు. ఇంకా రెండవ రోజు అలాగే ఈ వీకెండ్ తర్వాత కూడా సినిమా ఇదే తరహాలో కొనసాగితేనే ఎంతోకొంత నష్టాల భారీ నుంచి బయటపడుతుంది. మరి మొత్తంగా కస్టడీ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.